: కాంగ్రెస్ నేత ఇంట జరిగిన హత్యోదంతాన్ని ఛేదించారు!
ఢిల్లీలో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా నివాసంలో నిన్న వెలుగుచూసిన హత్యోదంతాన్ని పోలీసులు ఛేదించారు. సెల్జా పనిమనిషి భర్త సంజయ్ హతుడై పడి ఉండడం పట్ల దర్యాప్తు ఆరంభించిన పోలీసులు వంటవాడే నిందితుడని తేల్చారు. ఈ మేరకు అతడిని అరెస్టు చేశారు. వంటమనిషి అనిల్ యాదవ్, సంజయ్ ల మధ్య ఘర్షణ జరిగిందని, ఆ గొడవలో సంజయ్ తీవ్రగాయాలతో మరణించాడని పోలీసులు తెలిపారు. అనిల్ ముఖంపై గాయాలుండడంతో అనుమానించిన పోలీసులు ఆ దిశగా విచారించడంతో విషయం బయటపడింది. ఘర్షణ సమయంలో అనిల్ ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.