: పాకిస్థాన్ కు భారత్ తో యుద్ధం చేసే దమ్ము, ధైర్యం లేవు: మోడీ
కాశ్మీర్ పర్యటనలో మోడీ పాకిస్థాన్ పై తొలిసారి విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ కు భారత్ తో యుద్ధం చేసే దమ్ము లేదని మోడీ వ్యాఖ్యానించారు. భారత్ తో యుద్ధం చేసే దమ్ము, ధైర్యం లేకే... ఉగ్రవాదుల ద్వారా కాశ్మీర్ లో ప్రచ్ఛన్న యుద్ధాన్ని పాకిస్థాన్ సైన్యం ప్రోత్సహిస్తోందని మోడీ అన్నారు. భారత్ ను ఢీ కొట్టలేకే పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగుతోందని ఆయన ఆరోపించారు. కాశ్మీర్లో టెర్రరిజానికి పాకిస్థానే కారణమని మోడీ పేర్కొన్నారు. గతంలో కార్గిల్ యుద్ధసమయంలో కూడా తాను ఇక్కడకు వచ్చానని మోడీ అన్నారు.