: ధోనీని ఫ్లెచర్ తప్పుదోవ పట్టిస్తున్నాడు: ఇంజినీర్


ఇంగ్లండ్ టూర్లో టీమిండియా వైఫల్యాలపై మాజీ వికెట్ కీపర్ ఫారూఖ్ ఇంజినీర్ స్పందించారు. జట్టు ప్రదర్శనకు బాధ్యత కోచ్ ఫ్లెచర్ దేనని అన్నారు. దిశానిర్దేశం చేయాల్సిన కోచ్ ఫ్లెచర్... కెప్టెన్ ధోనీని తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు. ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం ఘోరతప్పిదమని, ఫ్లెచర్ అలాంటి సలహా ఇచ్చి ఉండాల్సింది కాదని ఇంజినీర్ అభిప్రాయపడ్డారు. భారీగా ఫీజు అందుకుంటున్న ఫ్లెచర్ మహాశయుడు కచ్చితంగా పిచ్ ను అంచనా వేసే ఉంటాడని, అందుకనుగుణంగానే సలహా ఇవ్వాల్సిందని పేర్కొన్నారు. సౌతాంప్టన్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని అందరూ భావించినా, మరీ నాసిరకం ఆటతీరుతో మూడు రోజుల్లోనే చేతులెత్తేయడం తెలిసిందే. దీనిపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తాయి.

  • Loading...

More Telugu News