: 22వేల పైచిలుకు కాంట్రాక్టు ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తాం: టీఎస్ డిప్యూటీ సీఎం రాజయ్య
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని నెరవేరుస్తామని టీఎస్ డిప్యూటీ సీఎం రాజయ్య తెలిపారు. లక్షల మంది రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రైతు రుణమాఫీపై ఆర్బీఐతో చర్చించేందుకు అధికారులు ముంబై వెళ్లారని తెలిపారు. 22వేల పైచిలుకు కాంట్రాక్టు ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామని వెల్లడించారు. అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, మూడెకరాల భూమి ఇస్తామని చెప్పారు. హైదరాబాదులో గవర్నర్ గిరీపై సుప్రీంకోర్టుకు వెళతామని తెలిపారు. ఉద్యమకారులపై కేసులన్నింటినీ ఎత్తివేస్తామని చెప్పారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలను వెల్లడించారు.