: విజయనగరం జిల్లా బుడ్డిపేట నుంచి వచ్చిన కేసీఆర్ సీఎం కాగా లేనిది....: రేవంత్ రెడ్డి


తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనవసర వివాదాలను సృష్టించి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని టీటీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ లేవనెత్తిన స్థానికత అంశంతో ఖమ్మం జిల్లాలోని పాల్వంచ, భద్రాచలం, మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్, కొడంగల్, గద్వాల్ ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఆంధ్రలోని విజయనగరం జిల్లా బుడ్డిపేట నుంచి వచ్చిన కేసీఆర్ తెలంగాణ సీఎం అయినప్పుడు... ఇక్కడ పుట్టి పెరిగిన విద్యార్థులు మాత్రం ఫీజు రీయింబర్స్ మెంట్ కు అర్హులు కారా? అని మండిపడ్డారు. ఎన్జీ రంగా యూనివర్శిటీకి జయశంకర్ పేరు పెట్టడాన్ని తాము తప్పు పట్టడం లేదన్న రేవంత్... రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పీవీ నరసింహారావు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. పేర్లు మార్చే అంశాన్ని తన కుమారుడి (తారక రామారావు) నుంచే అమలు చేస్తే ఇంకా బాగుంటుందని చురక అంటించారు. అలాగే, తమ అధినేత చంద్రబాబుకు లేఖ రాసిన హరీష్ రావుపై కూడా రేవంత్ మండి పడ్డారు. లేఖ ఏదైనా రాయాలనుకుంటే మీ శకుని మామ కేసీఆర్ కు రాయాలని సూచించారు.

  • Loading...

More Telugu News