: సమగ్ర జన సర్వే కోసం స్వస్థలాలకు తరలివెళుతున్న తెలంగాణ ప్రజలు


సమగ్ర జన సర్వే కోసం దేశంలోని మిగతా రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న తెలంగాణ ప్రజలు తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రం మీదుగా ప్రయాణిస్తున్న రైళ్లు తెలంగాణ ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ముంబయి నుంచి తెలంగాణ వస్తోన్న రైళ్లు, బస్సులు ఖాళీ ఉండటం లేదు. పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణలోని వివిధ పట్టణాలకు తిరుగుతున్న బస్సులలో టిక్కెట్లు ఈనెల 18వరకు అమ్ముడైపోయాయని... రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా బస్సులు తిప్పాలనుకుంటున్నామని ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు అంటున్నారు. రైళ్లలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే హైదరాబాద్ లో నివాసముంటున్న తెలంగాణ ప్రజలు కూడా 18 లోపు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు.

  • Loading...

More Telugu News