: గోకులాష్టమి ఉత్సవాల్లో జరిగే దహి హండిలో మైనర్లు పాల్గొనకూడదు: బాంబే హైకోర్టు


శ్రీకృష్ణుని జన్మదినమైన గోకులాష్టమి రోజున ముంబయిలో నిర్వహించే దహి హండీ ఉత్సవాల్లో మైనర్లు పాల్గొనవద్దని బాంబే హైకోర్టు సూచించింది. ఏటా కృష్ణాష్టమి సందర్భంగా ముంబయి నగరంలో ఎత్తుగా ఒక కుండను ఏర్పాటు చేసి అందులో పాలు, పెరుగు ఉంచుతారు. యువతీ యువకులు ఒకరిపై ఒకరు నిలబడి, పిరమిడ్ గా ఏర్పడి ఆ కుండను కొట్టేందుకు యత్నిస్తుంటారు. ఈ కార్యక్రమంలో 18 ఏళ్ల లోపు వారు పాల్గొనడాన్ని నిషేధించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజంపై హైకోర్టు స్పందించింది. ఈ క్రీడ ప్రమాదకరంగా మారడంతో అనేక మంది చిన్నారులు గాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News