: ఎంపీ కవితపై హైదరాబాదు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు


టీఆర్ఎస్ ఎంపీ కవితపై హైదరాబాదులోని మాదన్నపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కాశ్మీర్, తెలంగాణలను బలవంతంగా భారతదేశంలో విలీనం చేశారంటూ కొన్ని రోజుల కిందట ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ కరుణాసాగర్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఐపీసీ 124(ఏ), 153(ఏ), 505, సీఆర్ పీసీ 156 (3) సెక్షన్ల కింద కవితపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News