: మహబూబ్ నగర్ జిల్లాలో బ్యాంకుకే కన్నం వేశారు
మహబూబ్ నగర్ జిల్లాలో బ్యాంక్ దోపిడీ జరిగింది. బాలానగర్ లోని గ్రామీణ వికాస్ బ్యాంకులో చొరబడిన దొంగలు గ్యాస్ కట్టర్లు ఉపయోగించి లాకర్లను తెరిచారు. సీసీ కెమెరా పుటేజ్ ను కూడా వారు మాయం చేశారు. 11.5 కిలోల బంగారంతో పాటు 12 లక్షల రూపాయల నగదును వారు ఎత్తుకెళ్లిపోయారు. ఘటనా స్థలాన్ని డీఐజీ శశిధర్ రెడ్డి పరిశీలించారు. బ్యాంక్ లాకర్లలోని బంగారం దొంగల పాలవడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.