: గవర్నర్ కు ప్రత్యేక అధికారాలపై లోక్ సభలో చర్చ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాజధాని హైదరాబాదుకు చెందిన అధికారాలను కేంద్ర ప్రభుత్వం గవర్నర్ కు అప్పగించడంపై లోక్ సభలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణకు న్యాయం చేయాలని కోరారు. గవర్నర్ కు అధికారాలను కట్టబెట్టాలనడం చట్ట విరుద్ధమన్నారు. ఈ విషయంలో తెలంగాణకు న్యాయం చేయాలని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరారు.