: వైఎస్ బాటలో కేసీఆర్... హైదరాబాద్ భూములను అమ్మాలనుకుంటున్న టీఎస్ సర్కార్


మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో కేసీఆర్ కూడా పయనిస్తున్నారు. గతంలో సంక్షేమ పథకాల కోసం హైదరాబాద్ శివార్లలో ఉన్న భూములతో పాటు... మిగతా నగరాల్లో ఉన్న ప్రభుత్వ భూములను అమ్మి కోట్ల రూపాయలను అప్పటి వైయస్ సర్కార్ ఆర్జించింది. ఈ స్థలాల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బునే... సంక్షేమ పథకాల కోసం వైయస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో ఖర్చు పెట్టారు. ఇప్పడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు రుణమాఫీ చేయడానికి హైదరాబాద్ శివార్లలోని ఖరీదైన స్థలాలను అమ్మాలనుకుంటోంది. రైతు రుణాలను రీషెడ్యూల్ చేయడానికి ఆర్బీఐ పూర్తిగా ఒప్పుకోకపోవడంతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ చేయడానికి టీఎస్ సర్కార్ కు 19,000 కోట్లు అవసరమౌతాయి. ఆర్బీఐ ఇటీవలే రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలోని 100 మండలాల్లో మాత్రమే రీషెడ్యూల్ కు ఒప్పుకుంది. ఆర్బీఐ మూడు జిల్లాల్లోనే ఒప్పుకోవడం వల్ల కేవలం 4,000 కోట్లు మాత్రమే రీషెడ్యూల్ అవుతాయి. ఈ మొత్తం పోగా అవసరమైన మిగతా 15,000 కోట్లను ప్రభుత్వ స్థలాలను అమ్మి సమకూర్చుకోవాలని సూత్రప్రాయంగా టీఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే, హైదరాబాద్ లో ఏయే స్థలాలను అమ్మాలన్న విషయంపై కేసీఆర్ సర్కార్ ఆలోచన చేస్తోంది.

  • Loading...

More Telugu News