: కేసీఆర్ వైఖరిపై రాష్ట్రాల సీఎంలకు లేఖ రాస్తాం: కిషన్ రెడ్డి
ఉమ్మడి రాజధాని హైదరాబాదులోని శాంతి భద్రతల పరిరక్షణ అధికారాలను గవర్నర్ కు అప్పగించే విషయంలో సీఎం కేసీఆర్ వైఖరిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర పునర్విభజన బిల్లులోనే అధికారాల బదలాయింపు ఉందన్న సంగతి ఆయనకు తెలుసునన్నారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి, కేంద్రం నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలతో కలసి వ్యతిరేకిస్తానని కేసీఆర్ అనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై కేసీఆర్ మాటలు నమ్మవద్దని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాస్తామని చెప్పారు.