: పోలవరం సవరణ చట్టంపై స్టేకు సుప్రీం తిరస్కరణ


పోలవరం ముంపు మండలాల సవరణ చట్టంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కాగా, కేంద్రంతో పాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసిన రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి, గ్రామసభల తీర్మానాలకు వ్యతిరేకంగా గ్రామాలను విలీనం చేశారని అందులో పేర్కొన్నారు. త్వరలో విభజన పిటిషన్ లతో కలిపి ఈ పిటిషన్ పైన న్యాయస్థానం విచారణ జరపనుంది.

  • Loading...

More Telugu News