: బీహార్ లో నేటి నుంచి లాలూ, నితీశ్ ల ఉమ్మడి ప్రచారం


రెండు దశాబ్దాల కిందట ఎవరికి వారుగా విడిపోయిన రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జనతాదళ్ (యు) నేత నితీశ్ కుమార్ లు తాజాగా బీహార్ ఉప ఎన్నికల కోసం కలసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి నుంచి వీరిద్దరూ కలసి ప్రచారం చేయనున్నారు. అందులో భాగంగా ఈరోజు హాజీపూర్, మోహదినగర్ లో నిర్వహించే ర్యాలీ, బహిరంగసభల్లో ఇద్దరూ పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత వారం రోజుల పాటు జరిగే ప్రచారంలోనూ ఇద్దరూ పాల్గొంటారట. ఈ నెల 21న పది శాసనసభ స్థానాలకు బీహార్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఆర్జేడీ, జేడీ (యు) చెరి నాలుగు స్థానాలు, కాంగ్రెస్ రెండు స్థానాలకు పోటీ చేస్తోంది.

  • Loading...

More Telugu News