: ఎబోలా ఎఫెక్ట్: ప్రపంచవ్యాప్తంగా 'హెల్త్ ఎమర్జెన్సీ' ప్రకటించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
ప్రపంచ వాసులందరినీ గడగడలాడిస్తున్న ఎబోలా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా 'హెల్త్ ఎమర్జెన్సీని' వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. అన్ని దేశాలూ సమన్వయంతో పనిచేసి ఎబోలా వైరస్ ను మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా నియంత్రించాలని డబ్ల్యుహెచ్ఓ ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమ ఆఫ్రికాలోని గినియా, లైబీరియా, నైజీరియా, సియెర్రా లియోన్ దేశాల్లో ఈ వైరస్ వ్యాపించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ వల్ల సుమారు 1,000 మంది మరణించారని డబ్ల్యుహెచ్ఓ అంచనా వేస్తోంది. ఫ్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడంతో ప్రపంచదేశాలు ఎబోలా వైరస్ పై అప్రమత్తమయ్యాయి.