: ఎబోలా వైరస్ మనుషుల్లో ఎలా ప్రారంభమైంది? ఎలా వ్యాప్తి చెందింది?


ప్రపంచాన్ని వణికిస్తోన్న ఎబోలా వైరస్ మొదటిసారి 2013 డిసెంబర్ లో ఆఫ్రికా ఖండానికి చెందిన రెండేళ్ల పసిబాలుడిలో ప్రారంభమైందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆఫ్రికా ఖండానికి పశ్చిమాన ఉన్న గినియా దేశంలోని గుయ్ కేడో గ్రామంలో రెండేళ్ల పసిబాలుడు డిసెంబర్ 6న ఎబోలా వ్యాధితో మరణించాడు. ఈ పిల్లవాడు మరణించిన వారం రోజులకి అతని తల్లి చనిపోయింది. తల్లి చనిపోయిన కొన్ని రోజులకు... క్రిస్ట్ మస్ రోజున మూడేళ్ల అతని సోదరి మరణించింది. మరో ఐదు రోజులకి అంటే జనవరి ఒకటిన బాలుడి నాయనమ్మ చనిపోయింది. వీరి అంత్యక్రియలకు హాజరైన బంధువుల ద్వారా ఎబోలా వైరస్ సమీపంలోని గ్రామాలకు, పట్టణాలకు విస్తరించింది. దీంతో గుయ్ కేడో గ్రామం పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భారీ సంఖ్యలో చనిపోవడం మొదలుపెట్టారు. జనవరి నుంచి భారీ సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నప్పటికీ... పరిశోధకులు మార్చి నెలలో మాత్రమే ఎబోలా వ్యాధిని... వైరస్ ను గుర్తుపట్టగలిగారు. దీన్ని ఎబోలా వ్యాధిగా పరిశోధకులు గుర్తించేటప్పటికే... ఈ వైరస్ గినియా దేశంతో పాటు పక్క దేశాలకు కూడా వ్యాప్తి చెందింది. ఎబోలా వైరస్ వ్యాప్తి గబ్బిలాల నుండి మనుషులకు సోకి ఉండవచ్చని పరిశోధకులు బావిస్తున్నారు. గబ్బిలాలు తిని పడేసిన పండ్లను తినటం ద్వారా ఈ వ్యాధి మనుషుల్లోకి ప్రవేశించిందని వారు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News