: ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పట్నుంచి ఉంటున్నారు?... ప్రశ్నలు సర్వేలో తొలగింపు
సకలజన సర్వేలో స్థానికత అంశాన్ని తొలగించారు. వాస్తవానికి ముందుగా రూపొందించిన సర్వే ఫార్మాట్లో 'స్థానికత' అంశాన్ని చేర్చారు. ఈ అంశానికి సంబందించి 'మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు'... 'ఎన్నాళ్ల నుంచి తెలంగాణ ప్రాంతంలో ఉంటున్నారు'...'మీ మాతృ భాష ఏది' అనే ప్రశ్నలను సర్వే కాలమ్స్ లో జోడించారు. ఈ ప్రశ్నలపై కొన్నాళ్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విమర్శలతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై కొన్ని హైలెవల్ ఒత్తిడులు వచ్చినట్టు సమాచారం. ఈ ఒత్తిడుల నేపథ్యంలో స్థానికత కాలమ్ లో కేవలం 'మీ మాతృ భాష ఏది' అనే ప్రశ్నను మాత్రమే ఉంచుతున్నారు.