: ఎంసెట్ కౌన్సెలింగ్ పై నేడే సుప్రీం తుది తీర్పు
ఎంసెట్ కౌన్సిలింగ్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంపై ఈ రోజు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో, ఇరు రాష్ట్రాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుప్రీం తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఫీజు రీయింబర్స్ మెంట్ కు సంబంధించి ఇరు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత... సుప్రీంకోర్టు తన తుది తీర్పు వెల్లడిస్తుంది.