: 'పీకే' పోస్టర్ కు దుస్తులు తొడిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తాజా చిత్రం 'పీకే' పోస్టర్లు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అమీర్ ఒంటిపై బట్టల్లేకుండా కటి భాగానికి ఓ టేప్ రికార్డర్ ను అడ్డం పెట్టుకున్నట్టుగా ఉన్న ఆ పోస్టర్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. అయితే, ముంబయిలో 'పీకే' పోస్టర్ కు బట్టలు తొడిగాడో ఎమ్మెల్యే. విలేపార్లే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ శాసనసభ్యుడు కృష్ణ హెగ్డే... పోస్టర్ కు ఓ టీ షర్టు, నిక్కర్ తగిలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భారత సంస్కృతికి ఇలాంటి పోకడలు వ్యతిరేకమని అన్నారు. అమీర్ ఖాన్ ఓ మంచి నటుడని, సత్యమేవ జయతే వంటి కార్యక్రమం నిర్వాహించాడని చెబుతూ... అతడిని ఆదర్శంగా తీసుకున్న ప్రజల ఆలోచనా విధానంపై ఇలాంటి చర్యలతో తప్పుడు ముద్ర వేసినట్టవుతుందని హెగ్డే హితవు పలికారు.