: 'పవర్'ఫుల్ గా రవితేజ సినిమా ఆడియో వేడుక
మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం 'పవర్' ఆడియో ఫంక్షన్ హైదరాబాదు శిల్పకళావేదికలో వేడుకగా సాగుతోంది. ఈ కార్యక్రమానికి హీరో రవితేజ, హీరోయిన్లు హన్సికా మోత్వానీ, రెజీనా కాసాండ్రా, బ్రహ్మానందం, విలన్ సంపత్ రాజ్, క్యారెక్టర్ నటి ప్రగతి, దర్శకుడు కేఎస్ రవీంద్ర, సంగీతదర్శకుడు తమన్ తదితరులు హాజరయ్యారు. రాక్ లైన్ వెంకటేశ్ ఈ సినిమాకు నిర్మాత. కాగా, ఈ సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నారు. రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.