: నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద ఉద్ధృతి
కృష్ణా డెల్టా రైతులకు శుభవార్త! నాగార్జున సాగర్ డ్యాంకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 36 వేల క్యూసెక్కులు ఉండగా, 13 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 524 అడుగులకు చేరింది. కాగా, డ్యాం గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది.