: పట్టాలపై తెగిపడిన విద్యుత్ వైర్లు... పరుగులు పెట్టిన ప్రయాణికులు


విజయవాడ-కాకినాడ ప్యాసింజర్ రైలుకు నేడు పెనుప్రమాదం తప్పింది. విజయవాడ సమీపంలో గుణదల వద్ద పట్టాలపై విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఈ ఘటనలో ఓ విద్యుత్ స్తంభం బోగీపై ఒరిగిపోయింది. దీంతో, ప్యాసింజర్ రైలును అధికారులు నిలిపివేశారు. పట్టాలపై వైర్లు తెగిపడ్డాయన్న విషయం తెలుసుకున్న ప్రయాణికులు భయంతో రైలుదిగి పరుగులు పెట్టారు. ఈ ఘటనతో రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుణదల రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిందీ ఘటన.

  • Loading...

More Telugu News