: రాష్ట్ర విభజన వల్ల కాపులకు మంచే జరిగింది: టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు


కోస్తా జిల్లాల్లోని కాపు ఓటు బ్యాంక్ వల్లే టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిందని తూర్పుగోదావరి జిల్లా, రాంచంద్రాపురం ఎమ్మేల్యే తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని గుర్తించే ఉపముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు కాపులకు ఇచ్చారన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో జరిగిన కాపు ప్రజాప్రతినిధుల అభినందన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన వల్ల కాపులకు మంచే జరిగిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాతే కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియ వేగవంతమయ్యిందని... రాష్ట్రం కలిసి ఉంటే కాపులను బీసీలో చేర్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. త్వరలోనే కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియ పూర్తవుతుందన్నారు.

  • Loading...

More Telugu News