: ఎందుకిలా?... 110 మంది ప్రయాణికులతో మరో విమానం తప్పిపోయింది!


మలేసియా విమానం అదృశ్యం అయిన దగ్గర్నుంచి ఒకదాని తరువాత ఒకటిగా వరుసపెట్టి విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దులో విమాన ప్రమాదం ఘటన మరువక ముందే తైవాన్ లో మరో విమానం కూలిపోయింది. అది గడిచి 24 గంటలు కాకముందే అల్జీరియాకు చెందిన విమానం అదృశ్యమైంది. బుర్కినాఫాసో విమానాశ్రయం నుంచి అల్జీరియాకు వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి. ఏహెచ్ 5017 నెంబర్ గల ఈ విమానంలో మొత్తం 110 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. దీంతో ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. విమానం ఆచూకీ తెలుసుకునేందుకు అన్ని దేశాల సహాయసహకారాలు అధికారులు తీసుకుంటున్నారని ఆదేశాధికారులు తెలిపారు. కాగా, గతంలో అదృశ్యమైన మలేసియా విమానం ఆచూకీ నేటికీ లభ్యంకాకపోవడంతో అల్జీరియా విమానం ఆచూకీ లభ్యమవుతుందా? అనే సందేహం అందర్లోనూ తలెత్తుతోంది.

  • Loading...

More Telugu News