: ఇంటికెళ్తుండగా తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం చేశారు


ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీలోని గుర్గావ్ నుంచి ఉత్తరప్రదేశ్ లోని మధురలో గల నివాసానికి బయల్దేరిన మహిళను హస్తినలోని 8వ నెంబర్ జాతీయ రహదారిపై అటకాయించిన నలుగురు ఆగంతుకులు, తుపాకీతో బెదిరించి కారులో ఎక్కించుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె వద్దనున్న 5 వేల రూపాయల నగదు దోచుకుని పరారయ్యారు. దీంతో బాధితురాలు న్యూఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News