: కేసీఆర్ సర్కార్ పై సామ, దాన, భేద, దండోపాయాలు... కేంద్రం యోచన


తమ ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రం సీరియస్ గా ఉంది. పునర్వ్యవస్థీకరణ బిల్లులోని అంశాలను కూడా టీఎస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుండటాన్ని విపరీత అంశంగా పరిగణిస్తోంది. హైదరాబాదుపై గవర్నర్ కు అధికారాలను కట్టబెట్టేందుకు... అవసరమైతే టీఎస్ ప్రభుత్వంపై సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రతి అంశంలోనూ కేసీఆర్ సర్కార్ దుందుడుకు వైఖరితో ముందుకు పోతూ, రాజ్యాంగేతర శక్తిలా ప్రవర్తిస్తోందని కేంద్రం తలపోస్తోంది. టీఆర్ఎస్ నేతలు కాశ్మీర్ తో తెలంగాణను పోల్చడం, విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో విద్వేషాలను రెచ్చగొట్టడం, స్థానికత అంశంతో ఒక ప్రాంతం వారిని పరాయివారుగా చేసేందుకు ప్రయత్నించడం తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే దృష్టి సారించారని విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో, నరసింహన్ ను మార్చి భరద్వాజ్ లాంటి రాజకీయవేత్తను కొత్త గవర్నర్ గా నియమించే యోచనలో కేంద్రం ఉంది. అప్పటికీ పరిస్థితిలో మార్పు రాకుంటే... మరోసారి రాష్ట్రపతి పాలన విధించడానికి కూడా కేంద్రం వెనకడుగు వేయకపోవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News