: ఏపీ ప్రభుత్వాన్ని, ప్రజలను ఇబ్బంది పెట్టేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు: ఏపీ మంత్రి పల్లె
టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్ వ్యవహారశైలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఉందని ఆరోపించారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక సమస్య సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం అంశం దగ్గర్నుంచి గవర్నర్ అధికారాల వరకు ప్రతి విషయాన్ని సమస్యాత్మకం చేస్తున్నారని అన్నారు.