: హైదరాబాదుకు కూడా ప్లాస్టిక్ పార్క్: కేంద్ర మంత్రి అనంత్


తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్లాస్టిక్ పార్కును మంజూరు చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. దేశంలో మొత్తం నాలుగు నగరాలతో పాటు హైదరాబాదులో కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు హైదరాబాదులో అంతర్జాతీయ ప్లాస్టిక్ ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఇతర ప్రాంతాల్లో ఎనిమిదివేల ప్లాస్టిక్ యూనిట్లు ఉన్నాయని, వాటిద్వారా ఏడాదికి రూ.2,500 కోట్ల వ్యాపారం జరుగుతోందని చెప్పారు. అందుకే హైదరాబాదులో ప్లాస్టిక్ పార్కును ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాక మెదక్ జిల్లా రుద్రారంలో ప్లాస్టిక్ ఎడ్యుకేషన్ కోసం దాదాపు 20 ఎకరాల స్థలంలో సుమారు రూ.50 కోట్ల వ్యయంతో విద్యార్థులకు వసతి కల్పించేలా క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వివరించారు.

  • Loading...

More Telugu News