: తిరుమలలో అద్భుతం... మూగవాడికి మాటలొచ్చాయ్


కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి సన్నిధిలో అద్భుతం చోటుచేసుకుంది. జన్మతః మూగ అయిన లండన్ కు చెందిన ఓ వ్యక్తికి మాటలు రావడంతో ఆ కుటుంబం ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. లండన్ కు చెందిన దీపక్ (18) పుట్టుకతోనే మూగవాడు. మాటలు వచ్చేందుకు అతడి తల్లిదండ్రులు ఎంతో మంది వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు. అయినప్పటికీ ఫలితం శూన్యం. గత నాలుగేళ్లుగా దీపక్ కు లండన్ లో స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నారు. కానీ మాటలు రాలేదు. పెదాలు మాత్రం కదిలిస్తూ ఉండేవాడు. చాలాకాలం నాటి మొక్కు చెల్లించుకునేందుకు ఆ కుటుంబం తిరుమల వచ్చింది. స్వామివారి దర్శనం పూర్తయింది. అనంతరం వకుళామాత ఆలయంలో తీర్థం పుచ్చుకున్న అనంతరం దీపక్ స్పష్టంగా అమ్మా అన్నాడు. దానిని విన్న దీపక్ తల్లిదండ్రులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. కలియుగదైవం తమను కరుణించాడని వారు ఉప్పొంగిపోయారు. ఈ విషయం తెలిసిన టీటీడీ అధికారులు స్వామివారిని మనసారా వేడుకుంటే కోరికలు తీరుతాయని అన్నారు. అనంతరం తీర్థప్రసాదాలను దీపక్, అతని తల్లిదండ్రులకు అందించి, టీటీడీ అధికారులు అభినందించారు.

  • Loading...

More Telugu News