: ఏప్రిల్ 7న 'సెల్ఫీస్' పుస్తకం విడుదల చేస్తానంటున్న శృంగార మోడల్


అమెరికా శృంగార మోడల్ కిమ్ కర్థాషియాన్ ఏప్రిల్ 7న 'సెల్ఫీస్' పుస్తకాన్ని విడుదల చేస్తానని ప్రకటించింది. న్యూయార్క్ నగరానికి చెందిన 33 ఏళ్ల కిమ్ కర్దాషియాన్ కి శృంగార తారగా ఆమెరికాలో ఫుల్ పాప్యులారిటీ ఉంది. 2010లో 'కాన్ఫిడెన్సియల్' పేరిట కర్దాషియాన్ గతంలో ఓ పుస్తకం విడుదల చేసింది. తాజాగా 'సెల్ఫీస్' పేరిట మరో పుస్తకం విడుదల చేసేందుకు నిర్ణయించింది. ఒక వేలంటైన్ డే సందర్భంగా తాను తీసుకున్న సెక్సీ పోలరాయిడ్ ఫోటోలే తనను 'సెల్ఫీస్' పుస్తకం రాసే దిశగా ప్రేరేపించాయని కర్దాషియాన్ హొయలుపోతూ వెల్లడించింది. పుస్తకం పూర్తికాకముందే ధరను కూడా నిర్ణయించింది. ఒక్కో పుస్తకం 1200 రూపాయలు ఉంటుందని కర్దాషియాన్ తెలిపింది. పుస్తకం కర్దాషియాన్ ది కదా ధర ఎంత పెట్టినా అమ్ముడుపోతుందని పబ్లిషర్స్ సంబరపడిపోతున్నారు.

  • Loading...

More Telugu News