: రాజ్ నాథ్, మోడీ మంచి జోడీ... అందుకే ఎన్నికల్లో విజయం సాధించాం: అమిత్ షా


ఢిల్లీలో భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పార్టీ జెండాను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. దేశం నలుమూలల నుంచి ఈ సమావేశానికి రెండు వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా బీజేపీ కార్యవర్గం సమావేశమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ... తన మీద నమ్మకం ఉంచిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. అద్వానీ, మోడీ తదితరులు కష్టించి పనిచేసి ఈ స్థాయికి వచ్చారని ఆయన చెప్పారు. మోడీని ప్రధానిగా ప్రకటించగానే ప్రజలు ఆయన వెంట నడిచారని ఆయన అన్నారు. రాజ్ నాథ్, మోడీ మంచి జోడీ అని, అందుకే ఎన్నికల్లో విజయం సాధించారని అమిత్ షా అన్నారు. ఎన్నికల్లో భారీ మెజారిటీ రావడానికి ప్రతి ఒక్కరూ శ్రమించారని ఆయన అన్నారు. వాజ్ పేయి సమయంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే, ఈసారి పూర్తి మెజారిటీ సాధించామని ఆయన తెలిపారు. దేశాన్ని ప్రగతి వైపు నడిపించే నేత కోసం ప్రజలు ఎదురు చూశారన్నారు. గుజరాత్ తరహా అభివృద్ధిని చేస్తామన్న బీజేపీ హామీని ప్రజలు విశ్వసించారని ఆయన చెప్పారు. తనలాంటి సామాన్యుడు అధ్యక్ష పదవిని చేపట్టడం బీజేపీలోనే సాధ్యమని అమిత్ షా అన్నారు.

  • Loading...

More Telugu News