: వక్ర బుద్ధి చూపించిన పాకిస్థాన్


పాకిస్థాన్ మరోసారి తన కుటిల బుద్ధిని చూపించింది. జమ్మూకాశ్మీర్లోని బింబర్ గాలి సబ్ సెక్టార్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపి, మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆకస్మిక కాల్పులతో అప్రమత్తమైన భారత జవాన్లు పాక్ పన్నాగాన్ని తిప్పికొట్టారు. పాక్ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని, ఆస్తినష్టం కూడా సంభవించలేదని ఆర్మీ అధికారులు తెలిపారు. చీనాబ్ నదిలో కొట్టుకుపోయిన బీఎస్ఎఫ్ జవాను సత్యశీల్ యాదవ్ ను భారత సైన్యానికి అప్పగించిన కొన్ని గంటల్లోనే పాక్ కాల్పులకు తెగబడడాన్ని భారత్ ఖండించింది.

  • Loading...

More Telugu News