: కంగారుపడొద్దు... బాబాయ్ క్షేమంగా ఉన్నారు: ఎన్టీఆర్
సినీ హీరో నందమూరి బాలకృష్ణ శుక్రవారం తన తాజా చిత్రం షూటింగ్ లో స్వల్పంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో స్పందిస్తూ... 'అభిమానులు కంగారుపడొద్దు, బాబాయ్ క్షేమంగా ఉన్నాడ'ని అన్నారు. మళ్లీ సింహం గర్జిస్తుందని ట్వీట్ చేశాడు. బాబాయ్ త్వరగా కోలుకోవాలని జూ. ఎన్టీఆర్ ఆకాంక్షించారు.