: పెత్తనం కుదరదు... పోరాటానికి సిద్ధం: కేసీఆర్


ఉమ్మడి రాజధానిలో గవర్నరుకు విశేషాధికారాలంటూ సీఎస్ కు పంపిన లేఖపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ములుగు గ్రామంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రం అప్రజాస్వామికంగా ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేదిలేదని తేల్చిచెప్పారు. దీనిపై కేంద్రానికి ఘాటుగా లేఖ రాయాలని సీఎస్ ను ఆదేశించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వ అధికారాలను కేంద్రం కబళించాలని చూస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు చర్యలను ఖండిస్తున్నామని కేసీఆర్ అన్నారు. దీనిపై మరో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పంపిన లేఖను అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపాలని సీఎస్ ను ఆదేశించారు. త్వరలోనే ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వివరించాలని ఆయన పేర్కొన్నారు. కేంద్రం ఆదేశాలు అమలైతే హైదరాబాదుపై తెలంగాణ ప్రభుత్వం అజమాయిషీ పోతుందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News