: బలవంతంగా గణేష్ చందాలు వసూలు చేస్తే ఊరుకోం: హైదరాబాద్ పోలీస్ కమిషనర్
గణేష్ చతుర్థి సందర్భంగా ప్రజల నుంచి బలవంతంగా చందాలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాదు నగరంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడంపై నిషేధం విధించినట్లు ఆయన చెప్పారు. ఈ నెల 29వ తేదీ నుంచి నిషేధ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.