: హైదరాబాదు-నిజామాబాద్ మార్గంలో కొన్ని రైళ్లు రద్దు
మెదక్ జిల్లా మాసాయిపేట సమీపంలో స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ప్రమాదం నేపథ్యంలో... హైదరాబాదు - నిజామాబాదు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. స్కూల్ బస్సు ప్రమాదంలో గాయపడిన వారి వివరాల కోసం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. కాచిగూడ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ నెంబర్. 2755 0355ను ఏర్పాటు చేశారు. యశోద ఆసుపత్రిలో హెల్ప్ లైన్ నెంబరు 2771 3333, నాంపల్లి (హైదరాబాదు) రైల్వేస్టేషనులో హెల్ప్ లైన్ నెంబరుకు 2320 0865 ఫోన్ చేసి క్షతగాత్రుల వివరాలు తెలుసుకోవచ్చు. హైదరాబాదు-తాండూరు ప్యాసింజర్ రైలును రద్దు చేశారు. నిజామాబాద్-కాచిగూడ ప్యాసింజర్ రైలును రద్దు చేయగా, నాందేడ్- కాచిగూడ ప్యాసింజర్ రైలును పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.