: హైదరాబాదుకు ‘ప్లే బోయ్’ క్లబ్ వస్తోంది!


హైదరాబాదుకు ‘ప్లే బోయ్’ వస్తున్నాడు... దేశంలోనే తొలిసారిగా హైదరాబాదులో ‘ప్లే బోయ్’ క్లబ్ త్వరలో ఏర్పాటవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 'ప్లే బోయ్' సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు 40 బ్రాంచ్ లున్నాయి. అలాగే, అశ్లీల క్లబ్ గా ప్లేబోయ్ పేరుపొందింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్లే బోయ్ క్లబ్ ఏర్పాటును వ్యతిరేకించగా... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్వాగతించింది. దీంతో త్వరలో నగరంలోని నొవాటెల్ హోటల్ లో ఈ క్లబ్ ఏర్పాటవుతోంది. దీంతో, గత మూడేళ్లుగా ఇండియాలో అడుగుపెట్టేందుకు ప్లే బోయ్ చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. అయితే, ప్లేబోయ్ క్లబ్ ఏర్పాటును మహిళా సంఘాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

  • Loading...

More Telugu News