: ఫీజు రీయింబర్స్ మెంట్ పై కేసీఆర్ వ్యాఖ్యలు సమస్యను పెంచేలా ఉన్నాయి: ఏపీ మంత్రి రావెల
ఫీజు రీయింబర్స్ మెంట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు సమస్యను మరింత జఠిలం చేసేలా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు వ్యాఖ్యానించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో తమ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 58 శాతం ఫీజులను భరిస్తామని ప్రతిపాదించారని అన్నారు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.