: ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో మోడీకి క్లీన్ చిట్
ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఊరట లభించింది. ఈ నేపథ్యంలో గుజరాత్ పోలీసులు మోడీకి క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ మేరకు అహ్మదాబాద్ కోర్టుకు పోలీసులు ఈ కేసుకు సంబంధించిన నివేదిక సమర్పించారు. ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఓటేసిన అనంతరం పోలింగ్ కేంద్రం బయటకు వచ్చిన మోడీ పార్టీ గుర్తు కమలం చూపుతూ సెల్పీ ఫోటో దిగారు. దాంతో, పోలింగ్ కేంద్రం సమీపంలో పార్టీ గుర్తు చూపడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కేసు నమోదైంది. విచారించిన పోలీసులు మోడీ నియమావళిని ఉల్లంఘించలేదని తెలిపారు.