: తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం
తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం హైదరాబాదులోని మారియట్ హోటల్ లో ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ ఏడాది మొత్తం 63,047 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో పంటరుణాలు, అనుబంధ రుణాలు 27,233 కోట్ల రూపాయలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయం, విద్య, గృహ నిర్మాణానికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. కాగా, గతేడాది ఇచ్చిన మొత్తం రుణాలు 55,113 కోట్ల రూపాయలు.