: భారత్ లో 'ఎబొలా' కేసుల్లేవు, భయం వద్దు: కేంద్రం


శరవేగంతో విస్తరిస్తున్న ఎబొలా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, భారత్ లో ఎబోలా కేసులేవీ నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎబొలా ప్రభావిత దేశాల నుంచి భారత్ కు వచ్చే వారిపై పరిశీలన ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News