: కేసీఆర్... ముందు నీ ఆస్తులు ప్రకటించు!: పొన్నం
కాంగ్రెస్ హయాంలో అవినీతి జరిగిందని అంటున్న కేసీఆర్ ముందుగా తన ఆస్తులతో పాటు, కుటుంబ సభ్యుల, టీఆర్ఎస్ నేతల ఆస్తులు ప్రకటించాలని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కరెంట్ అడిగితే రైతుల్ని, ఉద్యోగాలు అడిగితే విద్యార్థులను, హైకోర్టు అడిగితే లాయర్లను కొడుతున్నారని అన్నారు. బోగస్ లబ్దిదారుల ఏరివేత కోసం సమగ్ర సర్వే అంటూ అర్హులకు అన్యాయం జరిగితే చూస్తూ ఉరుకోమని ఆయన హెచ్చరించారు. వలసలు ప్రోత్సహించి ప్రత్యర్థులను బలహీనం చేయాలని చూడడం రాజనీతి కాదని ఆయన సూచించారు.