: టీవీ9, ఏబీఎన్ ప్రసారాలను ఆపడం తప్పని నిరూపిస్తే ఉరేసుకుంటా: కేకే
మీడియా సెన్సార్ షిప్ ను వ్యతిరేకిస్తున్నానని టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు (కేకే) తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం మీడియాపై భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను ఆపేయడం సరైన చర్య అని ఆయన సమర్ధించారు. ఏపీ మీడియా ఛానెల్స్ అధినేతలు తప్పులు చేస్తారు, కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెబుతారు, మళ్లీ వెళ్లి అవే తప్పులు చేస్తారని ఆయన తెలిపారు. తెలంగాణకు సంబంధించిన వీ6, తెలంగాణ న్యూస్ ఛానెల్ లను ఆంధ్రలో ఆపేశారు. దానిని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ఛానెల్స్ ను ఆపేయడం సరైన చర్య కాదని ఎవరైనా నిరూపిస్తే రాజ్యసభలోనే ఉరి వేసుకుంటానని ఆయన అన్నారు.