: అత్యంత క్లిష్టంగా జశ్వంత్ సింగ్ ఆరోగ్యం
బీజేపీ మాజీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ ఆరోగ్య పరిస్థితి మరింత క్లిష్టంగా ఉందని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంట్లో జారిపడటంతో ఆయన తలకు తీవ్ర గాయం అయిందని, ప్రస్తుతం లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పై ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నారని పేర్కొంది. న్యూరోసర్జన్స్ టీమ్ ఆయన పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వివరించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా జశ్వంత్ కుటుంబంతో ఫోన్ లో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ లో తెలిపింది.