: సీఎం చంద్రబాబుపై మరోసారి మాజీ మంత్రి ఆనం ప్రశంసలు


ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఆనం రాంనారాయణ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలో చంద్రబాబు మంచి పాలన అందించగలరని ఆయన కీర్తించారు. ఈ మేరకు నెల్లూరులో మాట్లాడిన ఆయన, రాష్ట్ర విభజన అనంతరం ఏపీపై ఆర్థిక భారం పెరిగినందున రుణమాఫీ అమలుకు కొంత జాప్యం జరగవచ్చని అన్నారు. ఈ విషయంలో కేంద్రం సహకరించకపోయినా బాబు రుణమాఫీకి యత్నిస్తున్నారన్నారు. కేసీఆర్, చంద్రబాబులకు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఉందన్న ఆనం... ఇద్దరూ గురుశిష్యులే కాబట్టి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. తెలంగాణలో ఆంధ్రావాళ్లను సవతితల్లి బిడ్డల్లా చూడడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆనం టీడీపీలో చేరే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.

  • Loading...

More Telugu News