: త్వరలోనే ఏపీలో ఎన్టీఆర్ క్యాంటీన్లు... ముందుగా నాలుగు నగరాల్లోనే


తమిళనాడులో జయలలిత సర్కార్ ప్రవేశ పెట్టిన అమ్మ క్యాంటీన్ల స్ఫూర్తితో.... చంద్రబాబు సర్కార్ డిజైన్ చేసిన ఎన్టీఆర్ క్యాంటీన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ముందుగా ఎన్టీఆర్ క్యాంటీన్లను పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి నగరాల్లో ప్రారంభించనున్నారు. ఈ నాలుగు నగరాల్లో క్యాంటీన్ల ఏర్పాటుకు సివిల్ సప్లైస్ అధికారులు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. ఈ నాలుగు కేంద్రాల్లో వచ్చిన స్పందన ఆధారంగా... మార్పులు, చేర్పులతో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు వీటిని విస్తరిస్తారు. ఎన్టీఆర్ క్యాంటీన్లలో వడ్డించే ఆహార పదార్థాలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ ను ఎప్పటికప్పుడు తీసుకుంటూ... అవసరమైతే పదార్థాల మెనూను మార్చాల్సిందిగా చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News