: కేసీఆర్ కావాలనే కక్ష సాధింపు చర్యలకు దిగారు:రాపోలు ఆనందభాస్కర్


తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ చాలా తెలివైన వ్యక్తి అని... మనసులో చెడు ఉద్దేశ్యాలు పెట్టుకునే ఆయన టీవీ9, ఏబీఎన్ చానెల్స్ పై కక్ష సాధింపు చర్యలకు దిగారని కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ఆరోపించారు. కేసీఆర్ ఆదేశాలతోనే ఎంఎస్ఓలు కావాలనే టీవీ9, ఏబీఎన్ ప్రసారాలు నిలిపివేశారని ఆనందభాస్కర్ అన్నారు. ఈ విషయంలో చానళ్లను తాను వెనకేసుకురావడం లేదని...అయితే వారు తమ తప్పుకు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా నిషేధాన్ని విధించడం అన్యాయమని ఆయన అన్నారు. కేంద్రప్రభుత్వం ఈ విషయంలో కలుగజేసుకుని ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని రాపోలు కోరారు.

  • Loading...

More Telugu News