: మలాలకు కెనడియన్ పాప్ స్టార్ ప్రశంసలు
పాకిస్థాన్ సాహస బాలిక, యువ ఉద్యమకారిణి మలాల యూసఫ్ జాయ్ ను కెనడియన్ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ ప్రశంసించాడు. "ఇప్పుడే మలాలతో ఫేస్ టు ఫేస్ చాట్ చేశాను. తనకొక అద్భుతమైన కథ ఉంది. ఇక తనను స్వయంగా కలసి మాట్లాడకుండా ఉండలేను. బాలికల విద్యకోసం ఏర్పాటు చేసిన తన మలాల నిధికి ఏ విధంగా మద్దతివ్వగలనో అడుగుతాను. లవ్, ద బేబీ" అని పేర్కొన్నాడు. తాజాగా మలాలతో బీబర్ వీడియో చాట్ చేశాడు. ఆ సందర్భంగా పలు విషయాలను ఆమెను అడిగి తెలుసుకున్నాడు. త్వరలో వారిద్దరి వీడియో చాట్ ఫోటోలను కూడా బీబర్ పోస్ట్ చేయనున్నాడు.