: పోలీస్ స్టేషన్లలో సెటిల్ మెంట్లు చేయకండి: ఏపీ డీజీపీ రాముడు
గూండాయిజం, రౌడీయిజంలకు పాల్పడే అసాంఘిక శక్తులను అణచివేయాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఈ తరహా నేరాలకు పాల్పడే వ్యక్తులను కఠినంగా శిక్షించాలని పోలీసు ఉన్నతాధికారులకు పిలుపునిచ్చారు. 13 జిల్లాల ఎస్పీలు, ఐజీలు, డీఐజీలతో గురువారం ఆయన విజయవాడలో సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా భూకబ్జాలు ఎక్కవైపోతున్నాయని... వీటి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. చాలా పోలీస్ స్టేషన్లలో వైట్ కాలర్ నేరాలకు సంబంధించిన సెటిల్ మెంట్లు పోలీసులు చేస్తున్నారని... ఇలాంటివి చేస్తే ఇకపై కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులను ఆయన హెచ్చరించారు.