: ఆయన సినిమాల్లో హీరోయిన్ల వస్త్రధారణ ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలి: వి.హనుమంతరావు
మహిళలు గౌరవప్రదమైన దుస్తులు ధరించాలంటూ మురళీమోహన్ పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే పలువురు మహిళా ఎంపీలు మురళీమోహన్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా... తాజాగా రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆయనపై మండిపడ్డారు. సినీరంగం నుంచి వచ్చిన మురళీమోహన్ మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందని అన్నారు. గతంలో మురళీమోహన్ హీరోగా నటించిన సినిమాల్లో మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకునేవారో గుర్తుచేసుకోవాలని ఎద్దేవా చేశారు. మురళీమోహన్ సినిమాల్లో నటించినప్పుడు గుర్తుకు రాని సంప్రదాయాలు ఇప్పుడెందుకు గుర్తుకు వచ్చాయని ఆయన ప్రశ్నించారు.